ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు
● ముగ్గురికి తీవ్ర గాయాలు
దొరవారిసత్రం: జాతీయ రహదారిపై వెళ్తుతున్న ట్రాక్టర్‌ను వెనుకనే వస్తున్న కారు వేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణించే భార్యాభర్త కృష్ణ చందు, పల్లవి, ట్రాక్టర్ డ్రైవర్ గురవయ్య గాయపడిన ఘటన మంగళవారం టపాయిండ్లు గ్రామ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం.. అక్కరపార గ్రామం నుంచి సూళ్లూరుపేటకు ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను విజయవాడ నుంచి చైన్నెకి వెళ్లే కారు అదుపు తప్పి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించే భార్యాభర్తలు కృష్ణచందు, పల్లవితో పాటు ట్రాక్టర్ గురవయ్య గాయపడ్డారు. కారు ముందు భాగంగా దెబ్బతింది. కృష్ణచందు కారులో ఇరుక్కుపోయాడు. తర్వాత క్రైన్ సాయంతో సిబ్బంది బయటకు తీశారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను మొదట సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి మేరుగైన చికిత్స కోసం చైన్నెకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అజయ్‌కుమార్ తెలిపారు.


