● బస్సు ఎక్కనివ్వని కండక్టర్లు ● చిత్తూరు ప్రయాణికులకు
చిత్తూరు ప్రయాణికులంటే ఆర్టీసీ చిన్నచూపు చూస్తోంది. వేలూరులో చిత్తూరంటేనే బస్సు ఎక్కనివ్వడంలేదు. ఒక వేళ ఎక్కినా...సీటు లేదంటూ దింపేస్తున్నారు. చిత్తూరుకు రావాలంటే రాత్రిపూట ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రంపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటూ మండి పడుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఆరీస్టీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి.
– చిత్తూరు రూరల్ (కాణిపాకం)
ఆర్టీసీ చిత్తూరు మీదుగా వేలూరుకు 46 బస్సు లు కేటాయించింది. ఇందులో చిత్తూరు–2 డిపో నుంచి 9 బస్సులుండగా 54 ట్రిప్పులు, అరుణాచలానికి 4 బస్సులుండగా 8 ట్రిప్పులు, తిరుమల నుంచి 33 బస్సులకు గాను 66 ట్రిప్పులు ఆర్టీసీ తిప్పుతోంది. ఈ ప్రయాణంలో చిత్తూరు నుంచి వేలూరు వెళ్లేటప్పుడు మాత్రం ఆర్టీసీ బ స్టాండు నుంచి గుడిపాల వరకు కాట్పాడి... వేలూర్....వేలూర్ అంటూ పిలిచి ఎక్కించుకుంటున్నారు. తిరుమల సర్వీసుల్లో కూడా ఇలానే గౌరవంగా పిలిచి ఎక్కించుకుంటున్నారు. ఇలా నిత్యం వేలూరుకు వేల మంది వెళ్లి వస్తుంటారు. ప్రధానంగా సీఎంసీ, దుస్తుల కొనుగోలు, వ్యా పార లావాదేవీలు, వాహన, ఇతర సామగ్రి, ఎరువులు తదితర పనుల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే తిరుగు ప్రయాణంలో చిత్తూరంటే ఆర్టీసీ కండక్టర్లు బస్సుల్లో ఎక్కించుకోకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోతున్నారు.
కూటమి ప్రభుత్వంలో..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కరోనా కాలం తర్వాత చిత్తూరు ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించుకోవడం లేదని ఫిర్యాదు వస్తే అప్పటి ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తక్షణం స్పందించారు. ఏ డిపో బస్సులైనా చిత్తూరు ప్రయాణికులను ఎక్కించాల్సిందేనని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఆయన వైస్ చైర్మన్‌గా ఉన్నంత కాలం ఈ సమస్య రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది.
తిరుపతి డీపీటీఓతో మాట్లాడుతున్నాం..
వేలూరు నుంచి చిత్తూరుకు వచ్చే ప్రయాణికులను తిరుపతికి వెళ్లే బస్సుల్లో ఎక్కించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై తిరుపతి డీపీటీఓతో మాట్లాడుతున్నాం. కచ్చితంగా సమస్యలు రాకుండా చూస్తాం. ఏ మార్గాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయో చూసి కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
– జగదీష్, డీపీటీఓ, చిత్తూరు
● బస్సు ఎక్కనివ్వని కండక్టర్లు ● చిత్తూరు ప్రయాణికులకు
● బస్సు ఎక్కనివ్వని కండక్టర్లు ● చిత్తూరు ప్రయాణికులకు
● బస్సు ఎక్కనివ్వని కండక్టర్లు ● చిత్తూరు ప్రయాణికులకు


