
ములుగు: సమయానుకూల తను బట్టి ప్రజలకు హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయని నైజం ఉన్న ముఖ్య మంత్రి కేసీఆర్ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. గురువారం మేడారం సమ్మక్క సారలమ్మలను షర్మిల దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల తరపున పోరాడిన సమ్మక్క సారలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గిరిజనులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందన్నారు. గిరిజనులకు 3 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చింది వైఎస్సార్ అన్నారు.