విధి అంటే ఇదే భయ్యా.. వీడియో వైరల్‌ చేద్దామనుకున్నాడు.. తానే వైరల్‌ అయ్యాడు

Youth Injured Hit By Train While Making Reels At Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: అప్పట్లో టిక్‌టాక్‌ పిచ్చితో కొందరు యూత్‌ ఫేమస్‌ అవడం కోసం తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో చూసే ఉంటాము. ప్రస్తుతం రీల్స్‌ చేసేందుకు సోషల్‌ మీడియాలో పేరు కోసం కొందరు వింత చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కేంద్రంలో వడ్డేపల్లికి చెందిన అజయ్‌ ఆదివారం కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి రీల్స్​ చేద్దామని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ట్రాక్​ పక్కన వీడియో చేస్తుండగా ఖాజీపేట నుంచి బల్లార్ష వెళ్లే రైలు ఒక్కసారిగా అజయ్‌ను ఢీకొట్టింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో స్నేహితులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top