రూ.100 చెల్లించి క్లిక్‌ చేస్తే చాలు.. 

You Can Get Rakhi In Indian Post By Epass - Sakshi

    తపాలా ‘ఈ–షాప్‌’ ద్వారా బట్వాడా 

సాక్షి, హైదరాబాద్‌: వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి అందులో ఉన్న ఫొటోల్లో నచ్చిన రాఖీని ఎంపిక చేసుకొని.. అక్కడే ఉన్న నచ్చిన సందేశాన్ని కూడా క్లిక్‌ చేసి పంపాల్సిన చిరునామా టైప్‌ చేసేసి.. రూ.100 చెల్లిస్తే స్పీడ్‌ పోస్టులో సందేశంతోపాటు ఎంపిక చేసిన రాఖీ ఆ అడ్రస్‌కు చేరిపోతుంది. తొలిసారి రాఖీని ఈ–షాప్‌ పద్ధతిలో సోదరులకు పంపే ఏర్పాటు చేసింది. తపాలాశాఖ ఠీఠీఠీ.్ఛటజిౌp.్టటఞౌట్టట.జీn వెబ్‌సైట్‌ ద్వారా ఈ అవకాశం లభించనుంది. శుక్రవారం తపాలాశాఖ తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ రాజేంద్రకుమార్‌ దీన్ని ప్రారంభించారు. వెబ్‌సైట్‌లో రకరకాల నమూనాల రాఖీల చిత్రాలుంటాయి. పోస్టల్‌ కవర్, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ సందేశాలుంటాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top