పెళ్లి మండపంలోకి ప్రియురాలి ప్రవేశం.. తాళి కట్టే సమాయానికి

Woman Stops Marriage Due To Groom Cheated Her At Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల:  ఆర్భాటంగా పెళ్లి జరుగుతోంది. మరో రెండు నిమిషాల్లో వరుడు తాళి కట్టే సమయం.. ఇంతలో వరుడి ప్రియురాలి ప్రవేశం.. అంతే పీటలపైనే పెళ్లి ఆగిపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగిడి భీమా గార్డెన్స్‌లో జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు తెలిపిన వివరాలివి. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో నివాసం ఉంటున్న రమీణా గతంలో రామకృష్ణాపూర్‌లో ఉండేది.

సింగరేణి కార్మికుడి కూతురైన ఆమె ఇక్కడ ఉంటున్న సమయంలో.. బొద్దుల రాజేష్‌తో ప్రేమలో పడింది. ఆమెకు 2012లో మరో వ్యక్తితో వివాహం కాగా ఇద్దరూ మనస్పర్థలతో కొద్దిరోజులకే విడిపోయారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాజేష్‌ హన్మకొండలో ఫార్మసీ చేస్తున్న రమీణాతో మళ్లీ సాన్నిహిత్యం కొనసాగించి శారీరకంగా లొంగదీసుకున్నాడు.

రాజేశ్‌ వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని వాట్సాప్‌ స్టేటస్‌ ద్వారా తెలుసుకున్న రమీణా బుధవారం ఏకంగా పెళ్లి మండపానికి వచ్చి పెళ్లిని అడ్డుకుంది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు రంగప్రవేశం చేశారు. మరోవైపు పెళ్లికూతురు బంధువులు రాజేశ్‌ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసినట్టు మందమర్రి సీఐ ప్రమోద్‌రావు తెలిపారు.  
చదవండి: నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం.. ఎస్సై పరీక్ష సరిగ్గా రాయలేదని

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top