అయ్యో.. 5 లక్షల చేపలు మృత్యువాత

Vikarabad: Lakhs of Dead Fish in Akkalamma Cheruvu, Poison Suspected - Sakshi

బషీరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం మైల్వార్‌ గ్రామంలోని అక్కలమ్మ చెరువులో సుమారు 5 లక్షల చేపలు మత్యువాతపడ్డాయి. మైల్వార్‌ గ్రామానికి చెందిన 70 ముదిరాజ్‌ కుటుంబాలు చెరువులో చేపలు పెంచుతూ జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం గతేడాది వర్షాకాలంలో 2 లక్షల చేపపిల్లలను వారికి అందించింది. మరో 3 లక్షల పిల్లలను వాళ్లు కొనుగోలు చేసి పెంచుతున్నారు.

అయితే సోమవారం, మంగళవారం చెరువులోని చేపలు మత్యువాతపడి నీళ్లపై తేలాయి. రైతులు తుప్పలి కిష్టప్ప, గుండేపల్లి బుగ్గప్ప తదితరులు గమనించి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం కలిపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.  

చదవండి: 
ముందు పోలీస్‌ వాహనం.. వెనుకే ఆమె పరుగు..

Warangal: నా పెళ్లి ఆపండి సార్‌..!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top