
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది. కాగా, కృష్ణా జిల్లాలోని కీసర టోల్‌గేట్ సమీపంలో ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతితో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో టీఎస్‌ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.
ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యూలర్ టీఎస్‌ఆర్టీసీ బస్సుల రద్దు చేస్తున్నాం. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు టీఎస్‌ఆర్టీసీ బస్సులు వెళ్తాయి. ఎంజీబీఎస్ నుంచి ప్రతీ అరగంటకో బస్సు ఉంటుంది. దీనిపై మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలన్నారు.
ప్రయాణికులకు ముఖ్య గమనిక! హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) July 28, 2023
ఇది కూడా చదవండి: గోదావరి ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్