US Woman Love Marriage With Machareddy Man In Indian Tradition - Sakshi
Sakshi News home page

Love Marriage: మాచారెడ్డి అబ్బాయి వెడ్స్‌ అమెరికా అమ్మాయి

Mar 12 2023 11:56 AM | Updated on Mar 12 2023 3:10 PM

US Woman Love Marriage Machareddy Man - Sakshi

మాచారెడ్డి: అమెరికా అమ్మాయి మాచారెడ్డి అబ్బాయి వివాహానికి కామారెడ్డి పట్టణం వేదికైంది. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన సిద్దంశెట్టి గంగ, రమేశ్‌ల పెద్ద కుమారుడు సాయి సంకేత్‌ చదువుకోవడానికి అమెరికా వెళ్లాడు. అక్కడ సహాధ్యాయి అయిన కన్సిలో ఎలిజబెత్, ఫ్రాన్సిస్కో ఎర్నిస్టోల కూతురు రిషికతో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురూ తమ తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెప్పారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు అంగీకారం తెలపడంతో శనివారం రాత్రి కామారెడ్డిలోని సత్య గార్డెన్‌లో వివాహ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. 
(చదవండి: TSPSC: పేపర్‌ లీక్‌లో కొత్త కోణం.. ఉద్యోగికి హానీట్రాప్‌!)

Advertisement
 
Advertisement
Advertisement