
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. కేంద్రం నుంచి రావాల్సిన వాటా రాకపోవడంతో కొరత నెలకొంది. 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. ఏప్రిల్, మే, జూన్ లో కేంద్రం నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 3 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినట్లు పేర్కొన్న మంత్రి.. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఖరీఫ్ సీజన్‌లో అత్యధికంగా వాడకం ఉంటుందని తెలిపారు.
కేంద్ర మంత్రులు ప్రకాష్ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు తుమ్మల నాగేశ్వరరావు మరోసారి లేఖ రాశారు. నెలవారిగా కేటాయించిన విధంగా రాష్ట్రానికి యూరియా పంపిణీ చేయాలని.. యూరియా లోటు వలన రైతులు రానున్ననెలలో ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. తక్షణమే రాష్ట్రానికి కేటాయించిన యూరియాను పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.