దాతల సహాయం కోసం విద్యార్థిని ఎదురుచూపులు

Two Kidneys Failure Student Waiting For Donors In Chandur - Sakshi

రెండు కిడ్నీలు చెడిపోయి ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థిని

ఉన్నతాభ్యాసం చేసేందుకు అడ్డంకిగా ఆర్థిక సమస్యలు

దాతల సహాయం కోసం ఎదురుచూపు

చండూరు: నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. పెద్ద చదువులు చదివి ఉన్నత ఉ ద్యోగం చేయాలన్న ఆ విద్యార్థిని కోరికకు అనారోగ్య సమస్యలు అడ్డంకిగా మారాయి. వివరాలు.. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని కస్తాల గ్రామానికి చెందిన దోనాల భూపాల్‌రెడ్డి, ప్రేమలత దంపతులు 15 ఏళ్ల కిందట బతుకుదెరువు నిమిత్తం చండూరు పట్టణానికి వలస వచ్చారు. బ్యాంక్‌ రుణం సహాయంతో ఇక్కడే ఓ చిన్న ఇల్లు తీసుకున్నారు.
చదవండి: మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు

రైతుల నుంచి పాలు కొనుగోలు చేసి పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఇటీవల పెద్ద కుమార్తె పెళ్లి చేయగా, కుమారుడు చదువుకుంటున్నాడు. కాగా రెండో కుమార్తె గాయత్రి 8 ఏళ్ల క్రితం అనారోగ్యంపాలైంది. హైదరాబాద్‌లోని అనేక కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చూపించారు. రూ.18 లక్షలకు పైగా ఖర్చు చేసిన తర్వాత గాయత్రి రెండు కిడ్నీలు చెడిపోయినట్లు వైద్యులు చెప్పారు.
చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్‌ పార్క్‌ ‘తెలంగాణలో..’

దీంతో మందులు వాడుతూ కాలం వెళ్లదీస్తోంది. ప్రతినెలా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు మందులకు ఖర్చవుతుందని, పాల వ్యాపారంలో వచ్చే ఆదాయం ఇల్లు గడవడానికే సరిపోతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. మందులు తెచ్చేందుకు అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేక రెండు నెలలుగా మందులు వాడడం లేదని, దీంతో గాయత్రి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కిడ్నీల మార్పిడికి లక్షలు ఖర్చువుతుందని వైద్యులు చెబుతుండడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.

అనారోగ్యంతోనే డిగ్రీ పూర్తి
నడవలేని స్థితిలో ఉండి కూడా గాయత్రి నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ మైక్రో బయాలజీ పూర్తి చేసింది. వారంలో రెండు, మూడు రోజులు బస్సులో కళాశాలకు వెళ్లి వచ్చేది. తీవ్ర జ్వరం ఉన్నా సరే పరీక్షలు రాసి మొదటి ర్యాంకులో పాస్‌ అయ్యింది.

ఉన్నత చదువులు చదువుతా
నాకు ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక ఉంది. కానీ ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్నా. డబ్బులు లేక ఇటీవల మందులు కూడా వాడడం మానేశా. అక్క పెళ్లికి చేసిన అప్పు అలానే ఉండటంతో అమ్మానాన్న ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక తమ్ముడు చదువు మానేసి కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఎవరైనా దాతలు స్పందించి ఆర్థికసాయం చేస్తే మా కుటుంబ కష్టాల నుంచి బయటపడుతుంది.
-  గాయత్రి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top