జూన్‌ 6న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌–22

TSRJC CET 2022: Exam Date, Halltickes Download, Other Details - Sakshi

28 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 35 గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు సంబంధించి జూన్‌ 6న అర్హత పరీక్ష టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌–22 నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి సీహెచ్‌ రమణకుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ పరీక్ష రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 40,281 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, ఈనెల 28 నుంచి హాల్‌టికెట్లు వైబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుందని, మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.  

24 నుంచి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలు 
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ స్థాయి పరీక్షలు (10 ప్లస్‌ టు) ఈ నెల 24 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 24 నుంచి జూన్‌ 10 వరకూ జరగనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top