పురోగతిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం 

TS High Court Chief Justice Ujjal Bhuyan Unfurls National Flag on 74th Republic Day - Sakshi

గణతంత్ర దినోత్సవంలో హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

సాక్షి, హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం మనం వేడుకలు జరుపుకోవాల్సి న రోజు మాత్రమే కాదు.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి సాధించిన పురోగతిని ఆత్మపరిశీలన చేసుకునే సమయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ వ్యాఖ్యానించారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. వందనం చేశారు.

అనంత రం జస్టిస్‌ భూయాన్‌ మాట్లాడుతూ ‘రాజ్యాంగం ఆమోదం పొందిన నాటి నుంచి ఎంతో కాలం ప్రయాణించా. మనం సాధించిన లక్ష్యాలను గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం సమానమేనని రాజ్యాంగం చెబుతోంది. ఎక్కడా కులం, మతం, లింగం లాంటి భేదాలు ఉండకూడదు. దేశంలోని ప్రతి పేదవాడికీ న్యాయం అందేలా చూడాలి. పెండింగ్‌ కేసులను ఎంత వేగంగా పరిష్కరిస్తున్నామనేది కోర్టుల పనితీరుకు కొలమానం. దీనికి న్యాయవాదులు, రిజిస్ట్రీ సహకారం ఎంతో అవసరం’అని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు అధికారులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top