పెరిగిన టోల్‌ నేటి అర్ధరాత్రి నుంచే అమలు.. ఛార్జీలు వివరాలు ఇలా

Toll Charges hike by National Highways Corporation - Sakshi

అర్ధరాత్రి నుంచి అమల్లోకి..

5.5 శాతం మేర పెంచిన జాతీయ రహదారుల సంస్థ 

గతేడాదితో పోలిస్తే కాస్త తక్కువగానే మోత 

గత ఏడాది కాలంలో చార్జీలతో రూ.1,820 కోట్లు వసూలు 

ఈసారి అది రూ. 2 వేల కోట్లను దాటే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో చార్జీల పెంపు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. రోడ్ల నిర్వహణకు సంబంధించి ఏటా ఏప్రిల్‌ ఒకటి నుంచి చార్జీల పెంపును ఆనవాయితీగా తీసుకున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ).. ఈసారి కూడా కొత్త చార్జీలను సిద్ధం చేసింది. గతేడాది వివిధ కేటగిరీల వాహనాలకు సంబంధించి 8 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచగా.. ఈసారి వాహనదారులపై కాస్త దయతలిచి 5.50 శాతంలోపే పెంపును పరిమితం చేసింది.
(వాహనదారులకు షాక్‌?.. పెరగనున్న టోల్‌ చార్జీలు.. ఎంతంటే?)

విజయవాడ రహదారిలోని పంతంగి టోల్‌ ప్లాజాను ఉదాహరణగా తీసుకుంటే.. గతేడాది కారు/జీపు/వ్యాన్‌ కేటగిరీలో చార్జీని రూ.80 నుంచి రూ.90కి అంటే రూ.10 పెంచగా... ఈసారి రూ.90 నుంచి రూ.95కు అంటే రూ.5 మాత్రమే పెంచింది. ఇక గతేడాది టోల్‌ ధరలు అమల్లోకి వచ్చాక కొత్తగా ఐదు ప్రాంతాల్లో టోల్‌గేట్లు అందుబాటులోకి వచ్చాయి. 

పెరగనున్న ఆదాయం 
గత ఆర్థిక సంవత్సరంలో టోల్‌ప్లాజాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1,820 కోట్లు సమకూరాయి. ఈసారి దేశవ్యాప్తంగా మరిన్ని టోల్‌గేట్లు అందుబాటులోకి రావడం, ధరల పెంపు నేపథ్యంలో టోల్‌ వసూళ్లు రూ.2 వేలకోట్లను దాటిపోతాయని అంచనా. 

ఫాస్టాగ్‌తో కచ్చితమైన ఆదాయం 
గతంలో టోల్‌గేట్ల వద్ద నిర్వాహకులు భారీగా అక్రమాలకు పాల్పడటంతో.. వాహనాల నుంచి వసూలు చేసిన మొత్తంలో దాదాపు 25 శాతం పక్కదారి పట్టేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనితో ప్రభుత్వ ఖజానాకు చేరే మొత్తం తక్కువగా కనిపించేది. ఫాస్టాగ్‌ అమల్లోకి వచ్చాక అక్రమాలకు తెరపడి, ప్రతి రూపాయి లెక్కలోకి వస్తోంది. దీనితో గత మూడేళ్లుగా టోల్‌ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 98.6 శాతం వాహనాలు ఫాస్టాగ్‌ను వినియోగిస్తున్నాయి. 

విజయవాడ రోడ్డులోని కోర్లపహాడ్‌ ప్లాజాలో.. 
కార్లు, జీపులు సింగిల్‌ జర్నీ చార్జి రూ.120 నుంచి రూ.125కు.. రిటర్న్‌ జర్నీ రూ.180 నుంచి రూ.200కు.. నెల పాస్‌ రూ.4,025 నుంచి రూ.4,225కు.. 
► లైట్‌ కమర్షియల్‌ వాహనాలకు సింగిల్‌ ట్రిప్‌ రూ.190–రూ.200, రిటర్న్‌ జర్నీ రూ.285–రూ.300, నెలపాస్‌ రూ.6,385–రూ.6,710.. 
► బస్సు, ట్రక్కులకు సింగిల్‌ ట్రిప్‌ రూ.395–రూ.415, రిటర్న్‌ జర్నీ రూ.595–రూ.625, నెలపాస్‌ రూ.13,240–రూ.13,910కు.. 
► ఓవర్‌ సైజ్డ్‌ వెహికల్స్‌ సింగిల్‌ ట్రిప్‌ రూ.765 నుంచి రూ.805కు, రిటర్న్‌ జర్నీ 1,150–రూ.1,210, నెలపాస్‌ రూ.25,540–రూ.26840కు సవరించారు. 
 
చిల్లకల్లు టోల్‌ప్లాజాలో.. 

కార్, జీప్‌ సింగిల్‌ ట్రిప్పు రూ.100 నుంచి రూ.105కు, రిటర్న్‌ జర్నీ రూ.150–రూ.160, నెలపాస్‌ రూ.3,350–రూ.3,520కు పెంచారు. 
► లైట్‌ కమర్షియల్‌ వాహనాలకు సింగిల్‌ ట్రిప్పు రూ.160 నుంచి రూ.165కు, రిటర్న్‌ జర్నీ రూ.240–రూ.250, నెలపాస్‌ రూ.5,290–రూ.5,560కు.. 
► బస్సు, ట్రక్కులకు సింగిల్‌ ట్రిప్పు రూ.330–రూ.345, రిటర్న్‌ జర్నీ రూ.490–రూ.515, నెలపాస్‌ రూ.10,940–రూ.11,495కు.. 
► హెవీ వెహికల్స్‌ సింగిల్‌ ట్రిప్పు రూ.635–రూ.665, రిటర్న్‌ జర్నీ రూ.955–రూ.1,000, నెలపాస్‌ రూ.21,170–రూ.22,240కు సవరించారు. 
  
జాతీయ రహదారి 765 మీద కడ్తాల్‌ వద్ద.. 
కార్లు, జీపులకు సింగిల్‌ ట్రిప్పు రూ.45, రిటర్న్‌ జర్నీ రూ.65, నెల పాస్‌ రూ.1,495కు.. 
► లైట్‌ వెహికల్స్‌ సింగిల్‌ ట్రిప్పు రూ.75, రిటర్న్‌ జర్నీ రూ.110, నెలపాస్‌ రూ.2,420కు.. 
► బస్సు ట్రక్కులకు సింగిల్‌ ట్రిప్పు రూ.150, రిటర్న్‌ జర్నీ రూ.230, నెల పాస్‌ రూ.5,070 
► హెవీ వెహికల్స్‌ సింగిల్‌ ట్రిప్పు రూ.290, రిటర్న్‌ జర్నీ రూ.435, నెలపాస్‌ రూ.9,675కు పెంచారు. 
 
జాతీయ రహదారి 167పై మహబూబ్‌నగర్‌ జిల్లా మున్ననూర్‌ టోల్‌ ప్లాజా.. 
కార్లు, జీపుల సింగిల్‌ ట్రిప్పు రూ.45, రిటర్న్‌ జర్నీ రూ.65, నెలపాస్‌ రూ.1,475కు పెంచారు. 
► లైట్‌ వెహికల్‌ సింగిల్‌ ట్రిప్పు రూ.70, రిటర్న్‌ జర్నీ రూ.105, నెలపాస్‌ రూ.2,385కు.. 
► బస్సులు, ట్రక్కుల సింగిల్‌ ట్రిప్పు రూ.150, రిటర్న్‌ జర్నీ రూ.225, నెలపాస్‌ రూ.4,995 
► భారీ వాహనాలకు సింగిల్‌ ట్రిప్పు రూ.285, రిటర్న్‌ జర్నీ రూ.430, నెలపాస్‌ రూ.9,540గా నిర్ధారించారు. 
 
జాతీయ రహదారి 163 చిట్లపల్లి టోల్‌ప్లాజా వద్ద 
కార్లు, జీపులకు సింగిల్‌ ట్రిప్పు రూ.65, రిటర్న్‌ జర్నీ రూ.95, నెలపాస్‌ రూ.2,110కు పెంచారు. 
► లైట్‌ వెహికల్స్‌ సింగిల్‌ ట్రిప్పు రూ.100, రిటర్న్‌ జర్నీ రూ.155, నెల పాస్‌ రూ.3,410కు.. 
► బస్సు/ట్రక్కులకు సింగిల్‌ ట్రిప్పు రూ.215, రిటర్న్‌ జర్నీ రూ.320, నెలపాస్‌ రూ.7,145కు.. 
► హెవీ వెహికల్స్‌కు సింగిల్‌ ట్రిప్పు రూ.410, రిటర్న్‌ జర్నీ రూ.615, నెలపాస్‌ రూ.13,645కు పెంచారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top