నేతన‍్న పనితీరు అద్భుతం,చేనేత దుస్తులు ధరిద్దాం

National Handloom Day Celebrated At Raj Bhavan - Sakshi

చేనేత కార్మికులకు మద్దతునివ్వడానికి ప్రతిఒక్కరూ చేనేత దుస్తులు ధరించాలని, వాటి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్రపజలకు పిలుపునిచ్చారు. ప్రోత్సాహకాలకు నేత కార్మికులు అర్హులని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలని ఆకాంక్షించారు. శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని రాజ్‌ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ పలువురు నేత కార్మికులను సన్మానించారు.

2015లో తమిళనాడులో ప్రధాని మోదీ ప్రారంభించిన తొలి జాతీయ చేనేత దినోత్సవంలో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నేత కార్మికులు తమ వృత్తిపై అసాధారణమైన అభిరుచిని ప్రదర్శిస్తున్నారని, అద్భుతమైన డిజైన్‌లతో ఉత్పత్తులు తీసుకొస్తున్నారన్నారు. నారాయణపేట, సిద్దిపేట, వరంగల్‌ చేనేత ఉత్పత్తుల ప్రత్యేకతల ను తెలుపుతూ పోస్టల్‌ కవర్లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ కృషిని గవర్నర్‌ ప్రశంసించారు. – సాక్షి, హైదరాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top