
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవనున్నాయి. కాగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. చాలా వరకు సినిమాలు ఓటీటీని ఆశ్రయించాయి. అయితే కొన్ని పెద్ద సినిమాలు థియేటర్ రిలీజ్‌కోసం వేచి ఉన్నాయి. క్యూలో ఉన్న సినిమాలన్నీ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.