తెలుగు రాష్ట్రాలు: చుక్కలు చూపిస్తున్న చలి.. సింగిల్ డిజిట్‌ దిశగా ఉష్ణోగ్రతలు

Telugu States Shiver Under Winter Cold Wave 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత  పెరిగింది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. పగటి పూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. 

శనివారం(ఇవాళ), ఆదివారం చలి మరింతగా ప్రభావం చూపెడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణలో వికారాబాద్‌ పరిధిలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరోవైపు విశాఖ ఏజెన్సీ ప్రాంత్లానూ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి. సింగిల్‌ డిజిట్‌ దిశగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. పోను పోను మరింతగా చలి ప్రభావంగా మరింత పెరుగుతుందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ.

తెలుగు రాష్ట్రాల ప్రజలు గత వారంగా స్వెట్టర్లు, మంకీ క్యాప్స్‌పై ఆధారపడుతున్నారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

ఇక ఈ ఏడాది చలి కాలంలో రికార్డు స్థాయిలో లో-టెంపరేచర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక గుండె జబ్బులు, అస్తమా, అలర్జీ ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు, వృద్ధులు సాధ్యమైనంత వరకు మార్నింగ్‌ వాకింగ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలకు చలిగాలులు తగలకుండా చూసుకోవాలని పేరెంట్స్‌కి సూచిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top