తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు

Telangana traffic challan discount deadline extended again - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో ట్రాఫిక్‌ ఛలాన్ల రాయితీ గడువును మరోసారి పెంచారు. వచ్చే నెల(ఫిబ్రవరి) 15వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత పొడిగింపు ఉండదని అధికార వర్గాలు వెల్లడించినా.. పొడిగింపు వైపే ప్రభుత్వం మొగ్గు చూపించినట్లు స్పష్టమవుతోంది.

ఇదిలా ఉంటే.. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు అవకాశమిచ్చారు. తొలుత పదిహేను రోజులపాటు అవకాశమిచ్చిన పోలీసులు ఆ తర్వాత జనవరి 10 నుంచి ఈ నెలాఖరు వరకు పొడిగించారు.

.. తద్వారా పెండింగ్ చలాన్ల రాయితీ చెల్లింపులకు నెల రోజులకు పైగా సమయం దొరికింది. ఇక.. తెలంగాణ వ్యాప్తంగా  3.59 కోట్ల పెండింగ్ చలాన్లకు గాను ఇప్పటి వరకు 1,52,47,864 చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది.

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top