ఇక్ష్వాకుల కాలం నాటి టెర్రకోట బొమ్మ

Telangana: Terracotta Female Yakshini Sculpture Found In Siddipet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు క్రీస్తుశకం మూడో శతాబ్దానికి చెందిందని భావిస్తున్న టెర్రకోట బొమ్మ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామ శివారు శిథిల గ్రామ పాటిగడ్డమీద లభించింది. మహిళ రూపంతో ఉన్న ఈ టెర్రకోట బొమ్మను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ గుర్తించారు.

ఇది ఇక్ష్వాకుల కాలానికి చెందినదిగా ఆ బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. బొమ్మ తలపై ఉన్న మకరిక శిరోజాలంకరణ, నుదుట చూడామణి, చెవులకు కుండలాలు, కనుముక్కుతీరు నాగార్జున కొండ, కొండాపూర్‌లలో దొరికిన టెర్రకోట బొమ్మలను పోలి ఉండటంతో ఇలా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top