నిధులివ్వడానికి లబ్ధిదారులుండాలిగా!

Telangana State Compiling List Of Beneficiaries Of Double Bedroom Houses - Sakshi

రాష్ట్రానికి ‘ఆవాస్‌ యోజన’ నిధుల కేటాయింపులపై కేంద్రం ప్రశ్న 

‘డబుల్‌’ఇళ్ల లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తున్న రాష్ట్రం 

ఇదంతా తమ నియమాలకు విరుద్ధమని రూ. 800 కోట్లు నిలిపిన కేంద్రం 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘పేదల కోసం గృహాలు నిర్మిస్తుంటే ఆ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలు ఉండాలిగా. అవే లేవు. అలాంటప్పుడు కేంద్రం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’పథకం కింద నిధులెలా ఇచ్చేది’’ 

ఇది కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రశ్న. 
‘‘మేం రాష్ట్రంలో అమలు చేస్తున్న రెండు పడకల ఇళ్లకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న విధివిధానాలు వేరు. కావాలంటే లబ్ధిదారుల వివరాలు త్వరలో అందిస్తామని అండర్‌టేకింగ్‌ ఇస్తాం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని మీరు పరిశీలించొచ్చు. ఆ పథకం తదుపరి కిస్తీని విడుదల చేయండి’’ 

ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్రానికి ఇచ్చిన హామీ 
‘‘లబ్ధిదారుల జాబితా చూడనంతవరకు నిధుల విడుదల కుదరదు’ 

ఇది తాజాగా కేంద్రప్రభుత్వ యంత్రాంగం స్పష్టీకరణ 
డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇంతకాలం రుణాలు తీసుకొని ఆ పథకం కింద ఇళ్లను నిర్మిస్తున్న ప్రభుత్వం.. కేంద్రం పథకం ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన (పీఎంఏవై) కింద ఇచ్చే మొత్తాన్ని కూడా వాటికి జతచేసి అక్కడికక్కడికి సరిపోయేలా ప్లాన్‌ చేసుకుంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఆ ఇళ్ల విషయంలో అనుసరిస్తున్న తీరు కేంద్రం ఇచ్చే నిధులు రాకుండా అడ్డుగోడలా మారింది.

చకచకా పనులు కాని చ్చేసి కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన రూ. 900 కోట్ల బకాయిలను కేంద్రం నుంచి అందే నిధులతో తీర్చేద్దామనుకున్న తరు ణంలో నిబంధనలు వ్యతిరేకంగా ఉన్నాయంటూ పీఎంఏవై కింద ఇచ్చే నిధులు విడుదల చేయలేమని కేంద్రం తేల్చేసింది.

మరోవైపు బకాయిలు ఇస్తేనే పనులు చేస్తా మని కాంట్రాక్టర్లు పనులాపేశారు. హడ్కో నుంచి అప్పు తెద్దామంటే గరిష్ట మొత్తం ఇప్పటికే మంజూరై ఖర్చయిపోయింది. దీంతో పథకాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం సొంత ఖజానా నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

లబ్ధిదారుల జాబితా లేక.. 
గతంలో ఇందిరమ్మ పథకం కింద లక్షల్లో ఇళ్లను నిర్మించి పేదలకందించారు. పనులు మొదలయ్యేలోపే అర్హులను గుర్తించి గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసేవారు. తర్వాత పనులు అయ్యే కొద్ది వారికి నిధులు విడుదల చేస్తుండేవారు. కేంద్రం తన వంతు వాటాగా నిధులిచ్చేది. కానీ డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల పథకంలో అర్హులకు సంబంధించి ఓ అంచనా మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వమే ఇళ్లను నిర్మిస్తోంది. వాటిని అందించే వేళ లబ్ధిదారుల జాబితాను రూపొందించి ఇళ్లను కేటాయిస్తోంది.

2.91 లక్షల ఇళ్లకు గాను 1.08 లక్షల ఇళ్లను పూర్తి చేశారు. ఇందులో ఇప్పటివరకు 14,000 మందికే ఇళ్లను అందజేశారు. సిద్ధంగా ఉన్న మిగతా ఇళ్లకు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. కానీ కేంద్ర విధానం ప్రకారం ముందు లబ్ధిదారుల సంఖ్యను తేల్చి ఆ ప్రకారం ఇళ్లు నిర్మించాలి. దీంతో లబ్ధిదారుల జాబితానే సిద్ధంగా లేనప్పుడు ఏ సంఖ్య ఆధారంగా నిధులు విడుదల చేయాలని కేంద్రం ప్రశ్నిస్తోంది. సమాధానం లేకపోవటంతో నిధులు ఇచ్చేందుకు ససేమిరా అనేసింది.  

కనీసం 25 వేల మంది జాబితానిస్తే పరిశీలిస్తామన్న కేంద్రం 
కేంద్రం తాను మంజూరు చేసే పీఎంఏవై ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర చొప్పున కేటాయిస్తుంది. ఇందులో కొంతమొత్తాన్ని ముందుగానే విడుదల చేస్తూ రెండో కిస్తీగా 40 శాతం మొత్తాన్ని ఇస్తుంది. మిగతా మొ త్తాన్ని ఫైనల్‌ ఇన్‌స్పెక్షన్‌ తర్వాత విడుదల చేస్తుంది. తొలుత రూ.వేయి కోట్లకు పైగా కేంద్రం నుంచి రాగా, రెండో కిస్తీగా ఇప్పు డు రూ.800 కోట్లు రావాల్సి ఉంది. ఇది లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి సమర్పించి తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ డబుల్‌ బె డ్రూమ్‌ ఇళ్లలో ముందుగా లబ్ధిదారుల జాబి తాను రూపొందించకపోవటంతో కేంద్రానికి సమర్పించలేదు. అందుకే నిధులు అం దలేదు. దీనిపై 3, 4 నెలలుగా రాష్ట్ర అధికారులు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. జా బితా ఇవ్వకుండా నిధులు ఇవ్వటం సా«ధ్యం కాదని తేలడంతో మార్చి నాటికి జాబితా సిద్ధం చేసి ఇస్తామని రాష్ట్ర అధికారులు ఓ లేఖను సమర్పించారు. దాని కీ అధికారులు సంతృప్తి చెందలేదు. చివరగా కనీసం 25 వేల మందితో కూడిన జాబితాను సమర్పిస్తే పరిశీలిస్తామనగా అధికారులు ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నట్టు సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top