ధరణిని ప్రక్షాళన చేయండి

రఘునందన్ రావు
సాక్షి, హైదరాబాద్: అనేక సమస్యలు సృష్టిస్తున్న ధరణిలో మార్పులు తీసుకురావాలని బీజేపీ శాసనసభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వానికి సూచించారు. ఆయన గురువారం శాసనసభలో మాట్లాడుతూ పాత అసైన్డ్ భూములు, సాదా బైనామా ద్వారా కొన్న భూములు ధరణిలో నమోదు కావడం లేదని వివరించారు. వాటిని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిషేధిత భూములుగా ధరణి చూపిస్తోందని తెలిపారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దులపై ఆయన మాట్లాడుతూ, లక్షల్లో పెరిగిన అనాథ పిల్లల కోసం బడ్జెట్‌లో నిధి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కొన్ని పాఠశాలల ప్రస్తావన తెచ్చిన రఘునందన్.. అవి తమ పార్టీ చేపట్టినవిగా పేర్కొనడం సభలో వివాదం రేపింది. ఇది అప్రస్తుత ప్రసంగమంటూ మండిపడ్డ అధికార పక్ష సభ్యులు, పేరున్న పాఠశాలలకూ మతం రంగు పులమడం సరికాదని సూచించారు.