కొమురంభీం జిల్లాలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు..

Telangana Kumuram Bheem Asifabad District Earthquake - Sakshi

కౌటాల/చింతమానెపల్లి: చింతమానెపల్లి: కుమురం భీం జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం 8.40 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. కొద్ది సెకన్లపాటు వచ్చిన ప్రకంపనలతో ఆయా మండలాల ప్రజలు భయాందోళనలకు గుర య్యారు. సిర్పూర్‌(టి) నియోజకవర్గం కేంద్రంగా భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

కాగా, భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.1గా నమోదైంది. కౌటాల, సిర్పూర్‌(టి), చింతల మానెపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల్లోని పలు గ్రామాల్లో   ఇళ్లలోని వస్తువులు కింద పడటంతో గమనించిన పలువురు భయాందోళనలతో బయటకు పరుగెత్తారు.  భూప్రకంపనల ద్వారా ఎలాంటి నష్టం లేదని, ప్రజలు భయాందోళనలకు గురికా వొద్దని అధికారులు తెలిపారు.
చదవండి: ‘సిట్‌’ అంటే.. సిట్, స్టాండ్‌ మాత్రమే.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top