స్కూల్‌ టీచర్లకూ ‘ఇంటర్‌’ విధులు | Sakshi
Sakshi News home page

స్కూల్‌ టీచర్లకూ ‘ఇంటర్‌’ విధులు

Published Fri, Feb 24 2023 12:58 AM

Telangana Inter Board Arrangements For Inter Exam 2023 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల పకడ్బందీ నిర్వ హణకు కసరత్తు మొదలైంది. ప్రైవేట్‌ కాలేజీలతో మిలాఖత్‌ అయ్యేవారికి చెక్‌ పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెల 15 నుంచి మొదలయ్యే ఈ పరీక్షల విధుల్లోకి స్కూల్‌ టీచర్లను కూడా తీసుకోవాలని ఇంటర్‌ బోర్డ్‌ నిర్ణయించింది. ఇంటర్‌ కాలేజీ అధ్యాపకుల కొరత ఉన్నచోట టీచర్ల అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువుండే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్‌ టీచర్లను పరీక్షల విధులకు తీసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఇంటర్‌ బోర్డ్‌ తెలిపింది. ఈ ఏడాది ఫస్టియర్‌ ఇంటర్‌కు 4,82,619 మంది, సెకండియర్‌కు 4,65,391 మంది హాజరవుతున్నట్టు పేర్కొంది. ప్రైవేటు కాలేజీలతో మిలాఖత్‌ అయినట్టు ఆరోపణలున్న పరీక్షాకేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కాలేజీల్లో వీలైనంత వరకూ క్లీన్‌ రికార్డు ఉన్నవారికే ఇన్విజిలేషన్‌ బాధ్యతలు అప్పగించనున్నారు.

భద్రత మరింత పెంపు 
కొత్తగా ప్రవేశపెడుతున్న ఆన్‌లైన్‌ మూల్యాంకన విధానాన్ని అభాసుపాలు చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారనే ఆందోళన అధికారుల్లో ఉంది. వారికి అనుకూలంగా ఉండే బోర్డ్‌ సిబ్బందితో కలిసి వ్యతిరేక కార్యకలాపాలు సాగించే వీలుందని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో ప్రతీ పరీక్షకేంద్రం సమీపంలో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ పుటేజీని ఇంటర్‌బోర్డ్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బయటవ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటున్న వారిపై ఇంటర్‌ బోర్డ్‌ నిఘా పెట్టింది.  

క్షేత్రస్థాయిలోనూ సమీక్షిస్తున్నాం 
ఎక్కడా ఆరోపణలకు తావివ్వకుండా ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. క్షేత్రస్థాయిలో వాస్తవపరిస్థితులు, తీసు కోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షిస్తున్నాం. విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చేయడమే కాదు. పరీక్షకేంద్రాల్లో ఎలాంటి పక్షపాతానికి తావివ్వని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నివర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం.      
– జయప్రదాబాయి, ఇంటర్‌ పరీక్షల విభాగం కంట్రోలర్‌ 

ప్రతీ విద్యార్థి స్వేచ్ఛగా రాసేలా చర్యలు 
ఇంటర్‌ పరీక్షలను మంచి వాతావరణంలో ప్రతీ వి ద్యార్థి రాయాలని కోరు కుంటున్నాం. ఈసారి తొలి దశలో కొన్ని పేపర్ల కు ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేపడుతున్నాం. దీ నిపై విమర్శలు చేసే శక్తుల ప్రమేయం పరీక్ష లపై ఉండరాదని అధికారులను ఆదేశించాం. 
– నవీన్‌ మిత్తల్, ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి 

Advertisement
Advertisement