ఇంత బాధ్యతారాహిత్యమా? హైకోర్టు తీవ్ర అసంతృప్తి!

Telangana High Court Questions Govt On Ganesh Immersion - Sakshi

 కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టడం సర్కారుకు ఇష్టం లేనట్లుంది: హైకోర్టు

గణేష్‌ నిమజ్జనంపై ఆంక్షలు పెట్టాలన్న కేసులో తీర్పు వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌: గణేష్‌ విగ్రహాల నిమజ్జనం విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలన్న తమ ఆదేశాలపై ప్రభుత్వ స్పందన సరిగా లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిమజ్జనం సమయంలో ఆంక్షలు, నియంత్రణల చర్యలపై తామిచ్చే ఆదేశాలను చూపించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే చేద్దామని భావించినా..ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించింది. జల, వాయు కాలుష్యం నియంత్రణకు చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుందని వ్యాఖ్యానించింది. విచారణకు కొన్ని నిమిషాల ముందు ఉదయం 10.25 నిమిషాలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రిజిస్ట్రీలో నివేదిక సమర్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అమలు బాధ్యత ఎవరిది?
నగర పోలీసు కమిషనర్‌కు నివేదిక సమర్పించే తీరిక కూడా లేనట్టుందంటూ మండిపడింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీవోపీ)తో చేసిన భారీ గణేష్‌ విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్‌ కాలుష్య కాసారంగా మారుతోందని, వీటి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఇచి్చన సూచనల అమలు బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది. కరోనా, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వినాయక మండపాల ఏర్పాటు సమయంలో గుమిగూడకుండా, నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై తగిన ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేసింది.
చదవండి: పంది పాలు తాగిన పిల్లి.. వైరల్‌ అవుతున్న వీడియో 

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పును రిజర్వు చేసింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం విధించాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఇచి్చన ఆదేశాలను అమలు చేయడం లేదంటూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. కొన్ని నిమిషాల ముందు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే‹Ùకుమార్‌ నివేదిక సమర్పించారని, మరికొన్ని నిమిషాల్లో నగర పోలీసు కమిషనర్‌ నివేదిక సమరి్పస్తారని ప్రభుత్వ న్యాయవాది నివేదించడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు దాఖలు చేసిన నివేదిక పరిశీలించే అవకాశం లేదని, నగర పోలీసు కమిషనర్‌కు నివేదికే ఇచ్చే సమయం కూడా లేదా అని మండిపడింది. 
చదవండి: హైదరాబాద్‌ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా?.. హైకోర్టు ఆగ్రహం

నివేదికలు ఎప్పుడు పరిశీలించాలి?
విచారణను బుధవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘నాలుగు రోజుల క్రితం నివేదిక దాఖలు చేయాలని ఆదేశించినా విచారణకు కొన్ని నిమిషాల ముందు నివేదిక ఇచ్చారు. శుక్రవారం నుంచి హైకోర్టుకు సెలవులు. మీరిచ్చే నివేదికలు ఎప్పుడు పరిశీలించాలి ? ఇంకెప్పుడు మేం ఆదేశాలు ఇవ్వాలి ? సోమవారం ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తారా ? చివరి నిమిషంలో ఆదేశాలు ఇచ్చారు అమలు చేయలేకపోయాం అంటారు ? ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు ? మీ నివేదికలతో సంబంధం లేకుండానే ఆదే శాలు జారీచేస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.  

సలహాలు కాదు స్పష్టమైన మార్గదర్శకాలివ్వాలి 
మట్టి విగ్రహాలను మాత్రమే పెట్టుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఎక్కడికక్కడ నిమజ్జనం చేయాలని కోరుతున్నామని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. సలహాలు ఇవ్వడం కాదని, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీవోపీ) చేసిన విగ్రహాలను పెట్టకుండా చూడాలని, అలాగే విగ్రహాల ఎత్తును కూడా తగ్గించేలా చూడాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సూచనలు చేసినా వాటిని ఎందుకు అమలు చేయడం లేదని పీసీబీ తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశి్నంచింది. 

ఏమిటీ పీసీబీ తీరు?
కోరలు లేని పులిలా పీసీబీ వ్యవహరిస్తోందని, పీసీబీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన క్రషర్‌ యజమానులు తదితరులపై చర్యలు తీసుకున్న తరహాలోనే గణేష్‌ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనంలో పీసీబీ సూచనలు ఉల్లంఘించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నంచింది. సీపీసీబీ సిఫార్సుల నేపథ్యంలో పీవోపీతో చేసిన విగ్రహాలను నిషేధించారా ? అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా..పీవోపీతో చేసిన విగ్రహాలు అంత ప్రమాదకరం కాదని ఎన్‌జీటీ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పీవోపీ చేసిన విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోతుందని, అలాగే పూడిక పెరిగి బండ్‌కు ప్రమాదం ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొంది. ఎన్‌జీటీ ఇచి్చన తీర్పు సముద్రాల్లో విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిందని, చెరువుల్లో నిమజ్జనానికి ఆ తీర్పు వర్తించదని స్పష్టం చేసింది.

విగ్రహాల ఎత్తును 5 ఫీట్లకు మించకుండా చూడాలని, భారీ ఖర్చుతో జీహెచ్‌ఎంసీ నిరి్మంచిన  తాత్కాలిక కుంటల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేసేలా చూడాలని పిటిషనర్‌ వేణుమాధవ్‌ నివేదించారు. అన్ని విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడం ద్వారా పూడిక పెరిగిపోతోందని, చుట్టూ కట్టకు కూడా ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన ఓ అధికారి కూడా హుస్సేన్‌సాగర్‌ కట్టకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top