అమెరికా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి.. పెళ్లి మామూలుగా లేదుగా..

Telangana Guy Married American Lady In Hanamkonda - Sakshi

సాక్షి, హన్మకొండ: అమెరికా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి ఒక్కటయ్యారు. మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడిచి ఆలుమగలయ్యారు.‌ హిందూ సాంప్రదాయం పద్దతిలో ఓరుగల్లు వేదికగా ఖండాంతరం వివాహం చేసుకున్నారు. ఆదర్శ వివాహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు బంధుమిత్రులు హాజరై నవ దంపతులను అభినందించి ఆశీర్వదించారు.


చదవండి: పెట్స్‌.. అదో స్టేటస్‌! 

అమెరికా కు చెందిన యువతి డాక్టర్ జెన్నా బ్లెమర్‌ను హనుమకొండకు చెందిన పుట్ట అరవింద్ రెడ్డి వివాహం చేసుకున్నారు.‌ హనుమకొండలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో హిందూ సాంప్రదాయ పద్దతిలో ఇరు కుటుంబ సభ్యులు వివాహ వేడుక నిర్వహించారు. హన్మకొండకు చెందిన అనిత మోహన్‌రెడ్డి దంపతుల కుమారుడు అరవింద్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లగా అక్కడ డాక్టర్ జెన్నా బ్లెమర్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులకు తెలుపగా ఇరువురి పేరెంట్స్ ఓకే చెప్పారు.

ఇంకేముంది ముహుర్తం ఖరారు చేసుకుని హిందు సాంప్రదాయ పద్దతిలో హన్మకొండలో వివాహం జరిపించారు. అచ్చం తెలుగింటి ఆడపడుచులా చీరకట్టులో అమెరికా అమ్మాయి, వారి పేరెంట్స్ ముస్తాబై ముచ్చటపడ్డారు. కన్యాదానం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు హిందూ వివాహ సాంప్రదాయాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియా, హిందుసాంప్రదాయాలు చాలా బాగున్నాయని నవవదువు జెన్న బ్లెమర్ తెలిపారు. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నామని వరుడు అరవింద్ చెప్పారు.

అమెరికాకు చెందిన వధువు పేరెంట్స్ అచ్చం తెలుగువారిలా పంచే, చీరకట్టులో అందరి దృష్టిని ఆకర్షించారు. హిందూ సంప్రదాయాలు పెళ్ళితంతు నచ్చిందని అమ్మాయి పేరెంట్స్ తెలిపారు. అబ్బాయికి నచ్చిన అమ్మాయితో వివాహం జరిపించడం సంతోషంగా ఉందని వరుడి పేరెంట్స్ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top