
బడికి రాని విద్యార్థుల కోసం ఉపాధ్యాయుల యత్నాలు
నల్గొండ జిల్లా: బడికి రాని పిల్లలను బడికి రప్పించే విషయంలో ఉపాధ్యాయులు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసలు అందుకుంటున్నా యి. నల్లగొండ జిల్లాలో ఓ ఉపాధ్యా యుడు బడికి రాని విద్యార్థులను వారింటికి వెళ్లి మరీ బడికి తీసుకొ స్తుంటే.. మరో ఉపాధ్యాయుడు పిల్లల కోసం అద్దెకు తీసుకుని ఆటో ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కాశవారిగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం 13 మంది విద్యార్థులు చేరారు. అయితే, కొందరు విద్యార్థులు పాఠశా లకు సక్రమంగా రాకుండా ఇంటి వద్దే ఉంటుంటారు. దీంతో ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఉమాశంకర్‌గౌడ్, జాన్‌రెడ్డి విద్యార్థుల ఇంటికి వెళ్లి తమ బైక్‌పై ఎక్కించుకొని పాఠశాలకు తీసుకొచ్చి పాఠాలు బోధిస్తున్నారు.
దాత సాయంతో ఆటో తెచ్చి...
వరంగల్ జిల్లా నెక్కొండలోని హైస్కూల్‌కు పిల్లలను పంపాలని ఉపాధ్యాయులు సమీ పంలోని గుండ్రపల్లి, మడిపల్లి గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పదిమంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశా లకు పంపేందుకు ఒప్పుకున్న తల్లిదండ్రులు.. రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఆ పాఠశాల ఉపాధ్యా యుడు వంగర లక్ష్మణ్ విషయాన్ని తన చిన్ననాటి స్నేహితుడైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిరణ్‌ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన ప్రతినెలా ఆటోవాలాకు రూ.6,500 చెల్లించేలా ఒప్పుకున్నాడు. దీంతో సోమవారం పిల్లలు ఆటోలో స్కూల్‌కు వచ్చారు.