కరోనా : చేదు వార్త వినిపించిన టీ సర్కార్‌

Telangana Government On Coronavirus Spread In State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ప్రాణాంతక కరోనా వైరస్‌తో ఇప్పటికే తీవ్ర భయాందోళనకు గురవుతున్న ప్రజలకు తెలంగాణ సర్కార్‌ మరో చేదు వార్తను వినిపించింది. వైరస్‌ ప్రభావం వచ్చే నాలుగైదు వారాలు చాలా సంక్లిష్టంగా ఉంటుందని.. కరోనా వైరస్‌ కమ్యూనిటీలోకి వెళ్లిందని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ డీఎంఈ రమేష్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి ఉండబోతుందని,  ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుతమున్న స్థితిని కమ్యూనిటీ స్ప్రెడ్‌ అనలేమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో కేసులు పెరుగుతున్నాయని, కరోనాకు త్వరగా చికిత్స చేస్తే చాలా మంచిదని సూచించారు. (‘ఈ ఏడాది లడ్డూ వేలం లేదు’)

రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్ట్‌లకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. టెస్టుల నిర్వహణకు ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. కోర్టులో రోజుకో పిల్‌‌ వేయడం మంచి పరిణామం కాదని రమేష్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మెడికల్‌ సిబ్బందికి అందరూ మద్దతుగా నిలబడాలని కోరారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటికీ 6,500 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయని, అన్ని జిల్లా కేంద్రాల్లో చికిత్స చేస్తున్నారని, అత్యవసరమైతేనే హైదరాబాద్‌ రావాలని తెలిపారు.(కూల్చివేతల బులిటెన్ విడుదల చేయొచ్చుగా..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top