తెలంగాణలో ఎంసెట్‌ ఫలితాలు విడుదల

Telangana Eamcet 2020 Results Released October 6Th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌ 2020 ఫలితాలు విడుదలయ్యాయి. కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్టీయూ క్యాంప‌స్‌లో విద్యాశాఖ మండలి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.  ఎంసెట్‌ పరీక్ష రాసిన వారిలో 89,734 మంది(75%) ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈసారి మొదటి పది ర్యాంకులు అబ్బాయిలే సాధించారు. వారణాసి సాయితేజకు మొదటిఫస్ట్‌ ర్యాంక్‌ రాగా, యశ్వంత్‌ సాయి-రెండో ర్యాంక్‌, వెంకటకృష్ణ-మూడో ర్యాంక్‌ సాధించారు.

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ ‌చేయండి

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ జరిగిందన్నారు. విద్యార్థుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ముందుగా చెప్పినట్లు, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లతో పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా విద్యార్థులు వచ్చి పరీక్షలు రాశారని తెలిపిన మంత్రి ఈ మేరకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కరోనా కారణంగా కోవిడ్ వచ్చినా విద్యార్థులకు ఈనెల 8న మళ్ళీ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది ఎంసెట్ ఆలస్యమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో అధికారులు ఎంసెట్ పరీక్షను నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 102 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంసెట్‌ పరీక్షలకు 1,43,326 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1,19,183 మంది హాజరు అయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top