‘పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి’పై సీఎం సమీక్ష 18న

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈనెల 18న ప్రగతిభవన్‌లో ‘పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి’కార్యక్రమాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. సమీక్ష సమావేశంలో మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్‌బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డీపీవోలు, అటవీశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు పాల్గొంటారు.