వివాదంలో బండి సంజయ్‌ కుమారుడు.. తోటి విద్యార్థిపై..

Telangana BJP chief Bandi sanjay son booked for assaulting student - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమారుడిపై దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తోటి విద్యార్థిని దుర్భాషలా డుతూ దాడిచేసిన దృశ్యాలు సోషల్‌ మీడియా లో చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది. కుత్బు ల్లాపూర్‌ నియోజకవర్గం బహదూర్‌పల్లిలోని మహేంద్ర వర్సిటీలో బీటెక్‌ చదువుతున్న సంజయ్‌ కుమారుడు తోటి విద్యార్థిని అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా, చంపేస్తానంటూ బెదిరిస్తూ తీవ్రంగా కొట్టాడు. దీంతో వర్సిటీకి చెందిన స్టూడెంట్‌ అపెక్స్‌ కోఆర్డినేటర్‌ మంగళవారం దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ రమణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.  

అందుకే కొట్టాడు: కాగా బండి కుమారుడిపై కేసు నమోదైన విషయం తెలిశాక...అతని చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి మంగళవారం రాత్రి 11 గంటలకు ఒక వీడియో విడుదల చేశాడు. బండి సంజయ్‌ కుమారుడు స్నేహితుడి చెల్లెల్ని తాను ఇబ్బంది పెట్టానని, ఆ కారణంతోనే తనపై చేయిచేసుకున్నాడని వీడియోలో పేర్కొన్నాడు. ఇప్పుడు తామంతా మంచిగానే ఉన్నామని చెప్పాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top