ఓయూలో సమాధి కలకలం.. దానిపై తాజా పూలు చల్లి ఉండటంతో..

Students Panic After Seeing Tomb at Osmania University - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమాధి కలకలం రేపింది. ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ కళాశాల వసతి గృహం వెనుక అటవీ ప్రాంతంలో సమాధిని చూసి భయాందోళనకు గురయ్యారు. వారు తిరిగి వసతి గృహాలకు పరుగెత్తారు. ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఈసీహెచ్‌-1 వసతిగృహానికి దగ్గరగా చెట్ల మధ్య ఇది ఉంది. దానిపై తాజాగా చల్లిన పూలు ఉన్నాయి.
చదవండి: ఓయూ క్యాంపస్‌లో యూజర్‌ చార్జీలు.. ఇకపై నో ఫ్రీ వాకింగ్‌

అయితే అక్కడ జంతువును పూడ్చిపెట్టి ఉంటారని విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపు బస్తిలో ఉండే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క మూడు రోజుల కింద చనిపోతే దాన్ని ఆదివారం పూడ్చి పెట్టినట్లు ప్రత్యేక సాక్షి చెప్పడంతో.. ఓయూ అధికారులు, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు, విద్యార్థులందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: హైదరాబాద్‌: స్విగ్గి డెలివరీ బాయ్స్‌ సమ్మె.. నిలిచిన ఫుడ్ డెలివరీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top