వరంగల్: వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి గాయపడిన ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. 35వ డివిజన్ లోని నాలుగు జెండాల ప్రాంతంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి ఒంటరిగా వెళుతున్న వీధి కుక్కలు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి గాయపడింది. ఆ సమయంలో స్థానికులు ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
ఆ చిన్నారి మీద కుక్కలు పడిన సమయంలో స్థానికులు చూసి గట్టిగా కేకలు వేయడంతో ఆ కుక్కలు పారిపోయాయి. చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం గాయపడిన ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.


