ఎనిమిదేళ్లనాటి ‘నిర్లక్ష్య’ ఘటన.. అపోలో వైద్య బృందానికి భారీ జరిమానా

State Consumer Forum Fined Jubilee Hills Apollo Hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్యసేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అపోలో ఆసుపత్రి వైద్యుల బృందానికి భారీ జరిమానా విధించింది రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశించింది. బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని తెలిపింది. ఈ ఘటన ఎనిమిదేళ్ల కిందటి నాటిది కావడం గమనార్హం​.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం చందానగర్‌ హుడా కాలనీలో నివసించే ఎం.ఆర్‌.ఈశ్వరన్‌(53) తీవ్ర కడుపునొప్పితో 2012 సెప్టెంబర్‌ 18న జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటికే డయాబెటిక్‌ పేషెంట్‌గా ఎనిమిదేళ్లు ఆయన వైద్య సహాయం పొందుతున్నాడు. ఈశ్వరన్‌ను పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకొని కొలొనోస్కోపీ టెస్ట్‌ చేయించాలని సూచించారు. అదే నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు ‘కొలొనోస్కోపీ’పరీక్ష కోసం వైద్యులు అపాయింట్‌మెంట్‌ ఇవ్వగా, 3 గంటలు ఆలస్యంగా పరీక్షకు తీసుకెళ్లారు. 

అయితే ఈశ్వరన్‌ స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లాడు. 116 రోజులు వెంటిలేటర్‌పై ఉండి 2013 జనవరి 14న చనిపోయాడు. ఆసుపత్రి వైద్యులు, మేనేజ్‌మెంట్‌ నిర్లక్ష్యంతోనే ఈశ్వరన్‌ చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంతో.. తాజాగా పరిహారం తీర్పు వెల్లడించింది ఫోరం.

ఇదీ చదవండి: డబ్బుకోసం చూస్తే.. సుతారీ మేస్త్రీకి గుండె ఆగినంత పనైంది

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top