సత్వర విచారణ షాకా? | Special CBI court in Hyderabad to hear ED cases against YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

సత్వర విచారణ షాకా?

Oct 15 2026 3:25 AM | Updated on Oct 15 2026 3:25 AM

Special CBI court in Hyderabad to hear ED cases against YS Jagan Mohan Reddy

జగన్‌ అడిగిందే జరిగినా ఎల్లో మీడియా శివాలు 

రోజువారీ విచారణకు సీబీఐ న్యాయస్థానం అంగీకారం 

విచారణ వేగవంతం చేయాలని జగన్‌ అడుగుతున్నదే.. 

అయినా తప్పుడు వ్యాఖ్యానాలతో ఎల్లో విషం 

రెగ్యులర్‌ విచారణ జరుగుతున్నా ఈడీ అత్యుత్సాహం 

బాబు డైరెక్షన్‌లో కోర్టుకు అప్పీళ్లు 

కోర్టులో జరిగే పరిణామాలకు ఎల్లో మీడియా వక్రీకరణలు

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అక్రమంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మోపిన కేసుల్లో రోజువారీగా విచారణ జరిపేందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది. కేసులు సత్వరం ముగిసేలా సీబీఐతో పాటు ఈడీ కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని వైఎస్‌ జగన్‌ తరఫు న్యాయవాది ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తూ ఉండగా, అందుకు న్యాయమూర్తి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఈడీ పీపీకి ఆదేశాలు జారీచేసి విచారణ ప్రారంభించారు. సీబీఐ కోర్టులో పదేళ్లుగా 9 ఈడీ చార్జిషీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీలైనంత త్వరగా కేసులను ముగించాలని వైఎస్‌ జగన్‌ కోరుతూ వస్తున్నారు. మరోవైపు ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతున్న జగన్‌ను ప్రజాక్షేత్రానికి దూరం చేసి కోర్టుల చుట్టూ తిప్పాలన్న చంద్రబాబు అండ్‌ కో కుట్రలు ఫలించలేదు. 

జగన్‌ వ్యక్తిగత హాజరు కోరుతూ బాబు డైరెక్షన్‌లో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కానీ, ఎల్లో మీడియా మాత్రం వ్యక్తిగత హాజరుకు ఆదేశాలంటూ తప్పుడు ప్రచారం చేస్తూ అక్కసును వెళ్లగక్కింది. జగన్‌ న్యాయవాది విజ్ఞప్తికే న్యాయమూర్తి అంగీకరించగా.. జగన్‌కు షాక్‌ అంటూ విషం చిమ్మడం ప్రారంభించింది. సీబీఐ, ఈడీతో కలసి చంద్రబాబు.. వైఎస్‌ జగన్‌ పాదయాత్రను ఎలాగైనా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. బాబు మెప్పుకోసం పచ్చ మీడియా రోజంతా శివాలెత్తిపోయింది. ఆర్డర్‌ లేదు.. కాపీ కూడా లేదు.. బుధవారం ఉదయమంతా స్క్రోలింగ్‌లతో హడావుడి సృష్టించి పచ్చ మీడియా పైత్యాన్ని వెళ్లగక్కింది.  

కోర్టులో జరిగే పరిణామాలకూ వక్రీకరణలా? 
న్యాయస్థానాల్లో జరిగే పరిణామాలను ఎల్లోమీడియా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన ఈడీ కేసుల విచారణ విషయంలోనూ ఇదే ధోరణి స్పష్టమవుతోంది. ఈ కేసుల్లో సత్వర విచారణ  చేపట్టాలని ఆయన న్యాయవాది చేసిన విజ్ఞప్తిని, జగన్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లు చిత్రీకరించడం వెనుక రా>జకీయ దురుద్దేశం తేటతెల్లమవుతోంది. 

సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈడీ కేసులను రోజువారీగా విచారించాలన్న జగన్‌ తరఫు న్యాయవాది విజ్ఞప్తికి న్యాయమూర్తి అంగీకరించారు. ఈ మేరకు రోజువారీ విచారణకు హాజరుకావాలని ఈడీ న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసి.. విచారణ ప్రారంభిస్తున్నామని తెలిపారు. జగన్‌ వ్యక్తిగత హాజరుకు న్యాయమూర్తి ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయలేదు. అయినా, వ్యక్తిగత హాజరుపై ఆదేశాలిచ్చినట్లుగా ప్రచారం చేస్తూ కోర్టు పరిణామాలను వక్రీకరించడమే కాకుండా ప్రజలను కూడా ఎల్లో మీడియా తప్పుదోవ పట్టిస్తోంది.  

సత్వర విచారణ కోరితే షాకా? 
నిజానికి సీబీఐ, ఈడీ అక్రమంగా మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు త్వరగా ముగిసిపోవాలని, నిజానిజాలేమిటో తేలిపోవాలనే వైఎస్‌ జగన్‌ కోరుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాదులు అనేకమార్లు స్పష్టం చేశారు. జగన్‌ తరఫు న్యాయవాదులు కానీ, జగతి తరఫు న్యాయవాదులు కానీ సీబీఐ అక్రమ కేసుల్లో ఎప్పుడూ వాయిదా తీసుకోలేదు. కేసులు త్వరత్వరగా విచారణ జరగాలనే కోరుకున్నారు. నిజానికి కేసుల విచారణ త్వరగా పూర్తికావాలని కోరడం న్యాయపరమైన ప్రక్రియలో భాగం. దశాబ్దకాలంగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా తేల్చాలని జగన్‌ కోరుతున్న నేపథ్యంలో రోజువారీ విచారణకు న్యాయస్థానం అంగీకరించడం ఆయనకు అనుకూల న్యాయపరమైన పరిణామం. 

కానీ.. బాబు, భజన మీడియా మాత్రం జగన్‌కు షాక్‌ అంటూ ప్రచారం చేసింది. కోర్టు ఉత్తర్వుల్లో లేని అంశాలను జోడించి సంచలనాత్మక కథనాల పేర పచ్చ మీడియా బాబు బాకా ఊదుతోంది. ప్రజలను కలవడం కోసం జగన్‌ ప్రారంభించనున్న మహా పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని కొన్నాళ్లుగా చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. దీని కోసం సీబీఐ, ఈడీ కేసులను వినియోగించుకోవాలని తెర వెనుక అక్రమ రాజకీయం ప్రారంభించారు. దీనిలో భాగంగా ఈడీతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయించారు. ఉన్నత న్యాయస్థానం.. ఈడీ తీరును తప్పుబట్టిన విషయం తెలిసిందే. 

సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు తాము ఎప్పటికప్పుడు సీబీఐ, ఈడీ కేసులను పర్యవేక్షిస్తున్నామని తేల్చిచెప్పింది. ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో పచ్చ మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది. ఈ పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా జగన్‌ చేస్తున్న విజ్ఞప్తిని సీబీఐ కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. దీనికి కూడా పచ్చ మీడియా వక్రభాష్యాలు చెప్పడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఆయన విజ్ఞప్తిని ఎక్కడా ప్రస్తావన చేయకుండా సీబీఐ కోర్టు ఆదేశాలంటూ విషం చిమ్మింది.  

తప్పుడు కేసులు.. త్వరగా ముగియాలనే.. 
నిజానికి సీబీఐ, ఈడీ అక్రమంగా మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు త్వరగా ముగిసిపోవాలని, నిజానిజాలేమిటో తేలిపోవాలనే వైఎస్‌ జగన్‌ కోరుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాదులు అనేకమార్లు స్పష్టం చేశారు. జగన్‌ తరఫు న్యాయవాదులు కానీ, జగతి తరఫు న్యాయవాదులు కానీ సీబీఐ అక్రమ కేసుల్లో ఎప్పుడూ వాయిదా తీసుకోలేదు. అంటే కేసులు త్వరత్వరగా విచారణ జరగాలనే కోరుకున్నారని అర్ధం కావడం లేదూ?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement