ఆరుగురు సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్లు | Six Senior IPS Officers Promoted in Telangana | Sakshi
Sakshi News home page

ఆరుగురు సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్లు

Apr 22 2026 8:20 PM | Updated on Apr 22 2026 8:30 PM

Six Senior IPS Officers Promoted in Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్లు దక్కాయి. వీరంతా 1995, 1996 బ్యాచులకు చెందిన ఐపీఎస్‌లే. ప్రమోషన్లు పొందిన అధికారుల్లో వీవీ శ్రీనివాస్ రావు (1995 బ్యాచ్‌), స్వాతి లక్రా (1995 బ్యాచ్‌), మహేశ్‌ భగవత్ (1995 బ్యాచ్‌), చారుసిన్హా (1996 బ్యాచ్‌) డా.అనిల్ కుమార్ (1996 బ్యాచ్‌), వీసీ సజ్జనార్ (1996 బ్యాచ్‌) ఉన్నారు. 

వీరంతా అడిషనల్ డీజీ నుంచి డీజీలుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం (ఏప్రిల్‌ 22) ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం మహేశ్‌ భగవత్ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఉన్నారు. స్వాతి లక్రా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా ఇన్నాళ్లు కొనసాగుతున్నారు. వీవీ శ్రీనివాసరావు పోలీసు నియామక మండలి చైర్మన్‌గా ఉన్నారు. చారు సిన్హా సీఐడీ, మహిళా భద్రతా విభాగం, ఏసీబీ ఏడీజీగా కొనసాగుతున్నారు. అనిల్ కుమార్ గ్రేహౌండ్స్ ఏడీజీగా ఉన్నారు. వీసీ సజ్జనార్ హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement