అన్న మృతిని తట్టుకోలేక సోదరి కూడా..

Sister And Brother Deceased In Karimanagar - Sakshi

సాక్షి, కోనరావుపేట(వేములవాడ): సోదరుని మృతిని తట్టుకోలేక సోదరి కూడా ప్రాణాలు విడిచిన సంఘటన మండలంలోని కనగర్తిలో జరిగింది. కనగర్తికి చెందిన బడే రామయ్య శనివారం మృతి చెందాడు. అన్న మృతదేహాన్ని చూసిన చెల్లి నిజామాబాద్‌కు చెందిన తాళ్లపెల్లి లక్ష్మి కుప్పకూలింది. అన్నాచెల్లెళ్లు ఒకేసారి మృతిచెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. లక్ష్మికి భర్త పోచయ్య, కుమారుడు కిషన్‌ ఉన్నారు.  

మరో ఘటనలో..
పాముకాటుతో యువకుడి మృతి
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని గొల్లపల్లి(వట్టిమల్ల)లో పాముకాటుకు యువకుడు బలయ్యాడు. గ్రామానికి చెందిన చీమల ప్రశాంత్‌(26) 18 రోజుల క్రితం పొలం వద్ద గడ్డి కోస్తుండగా పాము కాటువేసింది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో 18 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతునికి భార్య వైష్ణవి, కుమారుడు నితీష్‌ ఉన్నారు.  

చదవండి: Canara Bank: పక్కా ప్లాన్‌.. రూ.338 కోట్లు ఎగనామం!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top