Shifted 10696 People To Safe Places In Telangana Floods - Sakshi
Sakshi News home page

10,696 మంది తరలింపు

Published Fri, Jul 28 2023 2:55 AM

shifted 10696 people to safe places - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముంపునకు గురైన 108 గ్రామాల నుంచి 10,696 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి తెలి పారు.  భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు ఉప్పొంగడంతో మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిందని, అక్కడికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించి 600 మందిని, మంథనిలోని గోపాల్‌పూర్‌ ఇసుక క్వారీ లో చిక్కుకున్న 19 మంది కార్మికులను సుర క్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు.

ఆర్మీ హెలికాప్టర్‌ను మోరంచపల్లికి పంపించి అక్కడ చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామన్నారు. మరో 4 హెలికాప్టర్లు, 10 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. డీజీపీ అంజనీ కుమార్‌తో కలిసి గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్‌ టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

జిల్లాల్లోని అన్ని పీహెచ్‌ సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుప త్రులను 24 గంటలు తెరచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఖమ్మం పట్టణానికి ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని, బూరు గుంపాడుకు హెలికాప్టర్‌ను వెంటనే పంపిస్తున్నామని తెలిపారు. ప్రయా ణికులు చిక్కుకున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారుల్లో సహాయ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. 

ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్‌లు...
వరద ప్రభావిత జిల్లాలకు పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వ ం నియమించింది. ములుగుకు కృష్ణ ఆదిత్య, భూపాలపల్లికి పి.గౌతమ్, నిర్మల్‌కు ముషా రఫ్‌ అలీ, మంచిర్యాలకు భారతి హోలికేరి, పెద్దపల్లికి సంగీత సత్యనారాయణ, ఆసిఫా బాద్‌కు హన్మంతరావును కేటాయించింది. 

వరద చూసేందుకు వెళ్లి చిక్కుకుంటున్నారు
వర్షాల నేపథ్యంలో ప్రజలు నీటి ప్రవాహం ఉన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జీలపై ప్రయాణించ వద్దని సీఎస్‌ సూచించారు. చాలాచోట్ల వరద పరిస్థితులను చూసేందుకు వెళ్లినవారు అనూ హ్యంగా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారని చెప్పారు.  

ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌..
సహాయ, పునరావాస కార్యక్రమాల పర్య వేక్షణకు ముగ్గురు సీనియర్‌ అధికారులతో సచివాలయంలో 7997950008, 7997 959782, 040 – 23450779 అనే ఫోన్‌ నంబర్లతో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని సీఎస్‌ తెలిపారు. అన్ని జిల్లా కలెక్టరేట్లలోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లా ముత్యాలధార జలపాతంలో చిక్కుకుపో యిన 80 మంది పర్యాటకులను బుధవా రం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో సురక్షి తంగా బయటకు తెచ్చామని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement