మహిళా భద్రతకు షీ టీం భరోసా | She Team Ensures Womens Safety In Telangana | Sakshi
Sakshi News home page

మహిళా భద్రతకు షీ టీం భరోసా

Dec 29 2022 4:24 AM | Updated on Dec 29 2022 11:15 AM

She Team Ensures Womens Safety In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళలకు భద్రమైన వాతావరణం కల్పించేందుకు 2014లో ఏర్పాటైన మహిళా భద్రతా విభాగం (షీ టీం) ఈ ఏడాది కూడా ఆసాంతం అతివల సమస్యలపై సత్వరమే స్పందించింది. 2022లో మొత్తం 6,157 ఫిర్యాదులు అందుకొని అందులో 521 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతోపాటు మరో 1,206 పెట్టి కేసులు నమోదు చేసి 1,842 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చింది.

మరోవైపు గృహహింస బాధితులకు భద్రత, భరోసా కల్పించేందుకు ధైర్య అనే యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించి దీన్ని డయల్‌ 100, అన్ని మహిళా పోలీసు స్టేషన్లకు అనుసంధానించింది. ఎన్‌ఆర్‌ఐ భర్తల మోసాలకు సంబంధించి 85 ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టింది. సైబర్‌ నేరాలపై స్కూలు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, రాష్ట్రవ్యాప్తంగా 250 మహిళా హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటుకు తోడ్పాటు అందించింది. ఈ మేరకు షీ టీం వార్షిక నివేదికను బుధవారం విడుదల చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement