ఎయిర్‌పోర్ట్‌లో క్యూ మేనేజ్‌మెంట్‌ | Shamshabad Airport Start Queue Management System | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌లో క్యూ మేనేజ్‌మెంట్‌

Jun 17 2021 10:34 AM | Updated on Jun 17 2021 10:42 AM

Shamshabad Airport Start Queue Management System - Sakshi

రద్దీని కెమెరాలు ఇలా నిక్షిప్తం చేసి సమయాన్ని అంచనా వేస్తాయి

శంషాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎంట్రీ, చెకిన్, సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్‌ ప్రదేశాల్లో రద్దీ నివారణ కోసం ఆల్‌గో విజన్‌ టెక్నాలజీ సంస్థ గెయిల్‌ సహకా రంతో క్యూ మేనేజ్‌మెంట్‌ సిస్టం ఏర్పాటు చేసింది. సెక్యూరిటీ కెమెరాల ద్వారా కృత్రిమ మేధ, వీడియో అనలిటిక్స్‌ కలిపి క్యూ మేనేజ్‌మెంట్‌ సిస్టం ఏర్పాటు చేసింది.

ఈ విధానంతో ప్రయాణికులు నిరీక్షించే సమయాన్ని నిర్ధారించి ఏయే ప్రాంతాల్లో ఎంత రద్దీ ఉంది? ఎంత సమయం వేచి ఉండాలనే సమాచారాన్ని డిస్‌ప్లే ద్వారా తెలుపుతుంది. దీంతో ప్రయాణికులు రద్దీలేని మార్గాలు ఎంచు కుని ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లొచ్చు. కెమెరా ట్యాంపరింగ్, పార్కింగ్‌ ఉల్లంఘన తదితర వాటిని కూడా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement