breaking news
quee lines
-
పేపర్‌లెస్ ఈ–బోర్డింగ్.. క్యూ మేనేజ్మెంట్
శంషాబాద్: దేశవ్యాప్తంగా కోవిడ్ తగ్గుముఖం పడుతున్న వేళ సురక్షితమైన విమానయానానికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. ఆయా రాష్ట్రాలు దేశీయ ప్రయాణంలో నిబంధనలను సడలించడంతో మళ్లీ విమానయానం ఊపందుకునే అవకాశం ఉంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలను కల్పించినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయంలోని విశేషాలివీ ►కాంటాక్ట్‌లెస్ బోర్డింగ్‌లో భాగంగా చెక్–ఇన్ హాల్స్ వద్ద సెల్ఫ్ కియోస్కులను ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ చెక్–ఇన్ ప్రక్రియ పూర్తవుతుంది. ►శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు. ►దేశంలోనే ఈ–బోర్డింగ్ సదుపాయం ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్. ►దేశీయ ప్రయాణంలో నిబంధనల సడలింపుతో ఊపందుకోనున్న విమానయానం పేపర్‌లెస్ ఈ–బోర్డింగ్ సౌకర్యం ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు గుర్తింపు సాధించింది. ►దేశీయ ప్రయాణంలో పూర్తి ఈ–బోర్డింగ్ సౌకర్యాన్ని కల్పించగా, అంతర్జాతీయంగా ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్, ఎమిరేట్స్, గో ఎయిర్‌లైన్స్ సంస్థలు ఈ–బోర్డింగ్ సదుపాయాన్ని వినియోగంలోకి తెచ్చాయి. ►ఇటీవల పైలట్ ప్రాజెక్టుగా క్యూ మేనేజ్మెంట్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. రద్దీ ప్రాంతాలపై డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఒకేచోట రద్దీ ఏర్పడకుండా నివారిస్తున్నారు. ►జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలు ‘హెచ్ఓఐ’ యాప్ తో భాగస్వామ్యాన్ని రూపొందించుకున్నాయి. దీంతో కాంటాక్ట్‌లెస్ ఫుడ్ ఆర్డర్లతోపాటు పేమెంట్ సౌకర్యాలను మొబైల్ ఫోన్ల ద్వారా ప్రయాణికులు పొందవచ్చు. ►భౌతిక దూరం నిబంధనలతోపాటు నిరంతర మాస్క్‌ల వినియోగం పర్యవేక్షణ మైక్‌ల ద్వారా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. ►టచ్‌లెస్ ఎలివేటర్లతోపాటు ఎక్కువగా వినియోగించే ట్రాలీలు, బెల్టులు ఇతర పరికరాలనూ శానిటైజ్ చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో క్యూ మేనేజ్మెంట్
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎంట్రీ, చెకిన్, సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ ప్రదేశాల్లో రద్దీ నివారణ కోసం ఆల్గో విజన్ టెక్నాలజీ సంస్థ గెయిల్ సహకా రంతో క్యూ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేసింది. సెక్యూరిటీ కెమెరాల ద్వారా కృత్రిమ మేధ, వీడియో అనలిటిక్స్ కలిపి క్యూ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేసింది. ఈ విధానంతో ప్రయాణికులు నిరీక్షించే సమయాన్ని నిర్ధారించి ఏయే ప్రాంతాల్లో ఎంత రద్దీ ఉంది? ఎంత సమయం వేచి ఉండాలనే సమాచారాన్ని డిస్ప్లే ద్వారా తెలుపుతుంది. దీంతో ప్రయాణికులు రద్దీలేని మార్గాలు ఎంచు కుని ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లొచ్చు. కెమెరా ట్యాంపరింగ్, పార్కింగ్ ఉల్లంఘన తదితర వాటిని కూడా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. -
దుర్గమ్మ క్యూలైన్లపై భక్తుల ఆగ్రహం
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లపై భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పాటు చేసిన అధికారులు మధ్యలో అత్యవసర మార్గాలను ఏర్పాటు చేయకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. క్యూ లైన్లలోని భక్తులు ఎవరైనా అస్వస్థతకు గురైతే వారికి వైద్యం అందించడం కూడా చాలా కష్టంగా మారింది. కొద్దిసేపటి క్రితం భక్తుల తొక్కిసలాటలో ఉక్కిరిబిక్కిరై కిందపడ్డ ఓ వృద్ధురాలిని వైద్య నిమిత్తం బయటికి తీసుకురావడం చాలా కష్టమైందని భక్తులు తెలిపారు.