
తెలంగాణలో సమ్మక్క– సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగో విడుదలైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ లోగోను విడుదల చేశారు. ఇందులో పలు విశేషాలు ఉన్నాయి.
లోగోలో ప్రధాన ఆకర్షణలు..
⇒ సమ్మక్క–సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ లోగో మధ్య సమ్మక్క–సారలక్క గద్దెలు
⇒ సమ్మక్క దేవత కుంకుమకు చిహ్నంగా మధ్యలో ఎర్రటి సూర్యుడు
⇒ ప్రశాంతమైన ఆధ్యాత్మిక కోణాన్ని జోడించే పీఠాలపై ఆసీనులైన ఇద్దరు వన దేవతలు
⇒ గిరిజన ఆహార్యం, సౌందర్యానికి సూచికగా నెమలి ఈకలు
⇒ సాంస్కృతిక గౌరవం, ధైర్యం సంప్రదాయాన్ని సూచించే రెండు జంతువుల కొమ్ములతో కూడిన కిరీటం
త్వరలో కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో తెలంగాణ సమ్మక్క– సారలమ్మ యూనివర్సిటీని సందర్శిస్తానని, కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి సమక్క– సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఆవిష్కరించారు.

కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో.. సమ్మక్క– సారలమ్మ కేంద్ర విశ్వ విద్యాలయాన్ని సాధించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
చదవండి: చొక్కా విప్పి.. చితిపై కప్పి