
ఆదిలాబాద్: లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన సాయిరాజ్ అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో ఇండియా తరఫున పాల్గొని బంగారు పతకాన్ని సాధించాడు. ఇటీవల నేపాల్‌దేశంలో జరిగిన అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో రాణించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో కోచ్ అన్నపూర్ణ, గ్రామస్తులు అతడిని అభినందించారు.