జూనియర్–సీనియర్
జిల్లాకేంద్రానికి చెందిన చిన్నపిల్లల వైద్యులు గేయన్మయి నాగరంజని, కావేటి శ్రీకాంత్‌లది ప్రేమవివాహం. వీరిద్దరూ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ విభాగంలో పీజీ చదువుతుండగా కలిశారు. శ్రీకాంత్ సీనియర్ కాగా, నాగరంజని ఆయనకు జూనియర్. అప్పట్లో వీరిద్దరికీ ఒకే వార్డులో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడే ఒకరి వివరాలు ఒకరికి తెలిశాయి. వారి విభాగం వారంతా ఒకసారి కోల్‌కతా కాన్ఫరెన్స్‌కి వెళ్లారు. అక్కడే ఒకరిపై మరొకరికి ఉన్న ఇష్టం బయటపడింది. చదువులు కూడా పూర్తికాగానే ఇద్దరూ ధైర్యం చేసి ఇంట్లోవాళ్లకి చెప్పారు. మొదట్లో నాగరంజని వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. చాలారోజులు వేచిచూసి పెద్దలను ఒప్పించేదాకా ఓపికతో ఉండి చివరకు విజయం సాధించారు. అలా 2014 డిసెంబర్ 7న మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపాలుగా ఒక పాప, బాబు ఉన్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోవాలని, ప్రేమను పొందాలంటే ఓర్పు ఉండాలని వీరు సూచిస్తున్నారు.


