ఇంట్లో ఒప్పించి ఒక్కటయ్యారు
జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యజంట అనిత, రా మకృష్ణలదీ ప్రేమవివాహమే. వీరిద్ద రు 1995లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. అప్పట్లో ప్రేమ అంటేనే ఓ భయం. ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలంటే ఇంకా భయం. కానీ, వీరిద్దరూ అప్పట్లోనే ఇంట్లో పెద్దలను ఒప్పించిన తర్వాతే పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య ప్రేమకు చిహ్నాలుగా పాప పద్మిని, బాబు ప్రద్యుమ్న ఉన్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం ఉంటేనే ప్రేమ కలకాలం నిలుస్తుందని, అలాంటి ప్రేమకూ అందరి మద్దతు ఉంటుందని వీరు చెబుతున్నారు.


