అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత
ఆదిలాబాద్‌టౌన్: అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఆదిలాబాద్ ఎఫ్‌ఆర్వో గులాబ్‌సింగ్ తెలిపారు. రెండు రోజుల క్రితం కలపను తరలిస్తున్న ఇచ్చోడకు చెందిన నిందితుడు అబ్బు, ఘోట్కురికి చెందిన వామన్‌ను పట్టుకుని విచారించగా, ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లికి కలప తరలించినట్లు పేర్కొన్నారు. దీంతో శుక్రవారం తిర్పెల్లిలో అధికారులు, ఉద్యోగులతో సోదాలు నిర్వహించగా, అల్లాబక్ష్ ఇంట్లో 23 టేకు సైజులు లభించినట్లు తెలిపారు. వీటి విలువ రూ.38వేలు ఉంటుందని పేర్కొన్నారు. దాడుల్లో ఎఫ్‌ఎస్వో రాథోడ్ గులాబ్, సిబ్బంది కృష్ణనాయక్, శరత్, అర్జున్ ఉన్నారు.


