● ఒక్కరోజుకు కాదు పరిమితం ● అర్థం చేసుకుంటేనే అర్థవంతం
నిర్మల్: ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14 ప్రేమికుల పండుగగా భావిస్తుంటారు. కానీ, ప్రేమ అనేది ఈ ఒక్కరోజుకే పరిమితం కావొద్దు. జీవితాంతం కొనసాగాలని చాలామంది సీనియర్ ప్రేమికులు చెబుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే జీవితం అర్థవంతంగా సాగుతుందని, లేదంటే అర్ధంతరంగా ముగుస్తుందని సూచిస్తున్నారు. పరస్పర గౌరవం, నమ్మకం, సహనం ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ నిలుస్తుందని, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్ట సమయంలో తోడుగా నిలవడమే అవసరమని చాలామంది చాటుతున్నారు. అలాంటి ప్రేమజంటలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.


