దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

కై లాస్‌నగర్‌: తెలంగాణ సాయుధ పోరాట యో ధుడు దొడ్డి కొమురయ్య బహుజన ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. కొమురయ్య జయంతి వేడుకలను కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం అధికారికంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్‌, బీసీ సంఘాల ప్రతి నిధులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొమురయ్య త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం బీసీ సంఘాల నాయకులు కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఇందులో అదనపు కలెక్టర్‌ ఎస్‌. రాజేశ్వర్‌, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సోనియా, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement