ఆదిలాబాద్‌రూరల్: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఆదివాసీ, గిరిజన యువత కోసం పో లీస్‌శాఖ తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్‌లో గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్తులు ఓ గదిని సమకూర్చగా మిగతా ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 13న డీజీపీ శివధర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందు కు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎస్పీ అఖిల్ మ హాజన్ గ్రా మాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. అదే రోజున జిల్లాలోని సార్‌మేడిలు, గ్రామపటేళ్లు, మహా జన్‌లతో డీజీపీ సమావేశం కానున్నట్లు పలు వురు ఆదివాసీ నేతలు తెలిపారు.


