ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ మున్సిపల్ బీఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్‌గా 49వ వార్డు కౌన్సిలర్ వేనగంటి ప్రకాశ్ నియామకం అయ్యారు. ఈమేరకు మాజీ మంత్రి జోగు రామన్న శుక్రవారం ఆయనకు నియామక పత్రం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టణాభివృద్ధికి విశేష కృషి చేసిందని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత కౌన్సిల్‌లోనూ పార్టీ కౌన్సిలర్లు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్, వసంత్, వెంకటేశ్, డాక్టర్ గౌస్, సలీమ్, అనిల్, పర్వీన్ పాల్గొన్నారు.


