కేసీఆర్‌ది రాజకీయ ప్రా‘ధాన్యం’: రేవంత్‌

Revanth Reddy Comments On Telangana CM KCR - Sakshi

మంత్రి హత్యకు కుట్రపై జ్యుడీషియల్‌ విచారణకు డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షుద్ర రాజకీయ క్రీడ నడుపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం ఉప్పు డు బియ్యం కొనదని చెబుతున్నందున యాసంగి ధాన్యం సేకరించేదిలేదని కేసీఆర్‌ చెప్పడం రైతులను రాజకీయంగా వాడుకోవడమేనని అన్నారు. గురువారం గాంధీభవన్‌లో జాతీయ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

పంటల కొనుగోలు, పంటలపై ఆంక్షలు, ధరణి సమస్యలు, రుణమాఫీ వంటి అంశాలపై చర్చ జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాసంగిలో వడ్లు కొనబోమని చెప్పడంతో ఈసారి రాష్ట్రంలో వరిసాగు 35 లక్షల ఎకరాలకే పరిమితమైందని, తద్వారా 70 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అన్నారు.

మార్చి నాటికే యాసంగి ధాన్యం కొనుగోలుపై ప్రణాళికలు రూపొందించి అమలు చేయాల్సిన ప్రభు త్వం చేతులెత్తేయడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నా రని విచారం వ్యక్తం చేశారు. దీన్ని ఆసరాగా చేసుకొని  మిల్ల ర్లు రైతుల వద్ద నుంచి క్వింటాకు రూ.1,400 నుంచి రూ. 1,500 కొనుగోలు చేసేందుకు ఇప్పటి నుంచే ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌ ఇక్కడ సమస్యలు సృష్టించి కేంద్రంతో కొట్లాడుతున్నట్టు రాజకీయం చేస్తున్నా రని విమర్శించారు. కాగా, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో నిజానిజాలు బయటకు రావాలంటే జ్యుడీషి యల్‌ విచారణ జరిపించాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. రైతు సమస్యలపై 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top